వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

Stone-Pelting on Trains

Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ … Read more

Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..

Himachal Pradesh

Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు. మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించామ‌ని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నార‌ని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాల‌ను … Read more

Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు

mixing Human URINE

Ghaziabad : ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలిపాడు. మూత్రం ఉన్న లీటర్‌ బాటిల్‌ ఆ షాపు వద్ద క‌నిపించింది. దీనిని చూసిన స్థానికులు స‌ద‌రు షాపు య‌జ‌మానిని నిలదీసి దాడిచేశారు. అనంత‌రం పోలీసులకు అప్ప‌గించి ఫిర్యాదు చేయ‌డంతో ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమానిని అరెస్ట్‌ చేశారు. షాపులోని యూరిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్‌, … Read more

యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్

Vadodara Gangrape

UP Rampur Incident | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మరో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులను సాజిద్ పాషా, ముదస్సిర్‌లుగా గుర్తించారు. రాంపూర్ జిల్లాలోని గ్రీన్ సిటీ హాస్పిటల్ అనే పేరున్న ఆసుపత్రికి పాషా డైరెక్టర్ గా ఉన్నారు. ఆగస్టు 31, 2024 నిందితులు మైనర్ బాధితురాలిని కోచింగ్‌కు తీసుకువెళతాననే నెపంతో కిడ్నాప్ చేశారు. నివేదికల ప్రకారం, … Read more

అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

Ayodhya Vashishth Kunj Township

Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువ‌ర్ణావ‌కాశం.. రామమందిరానికి కేవ‌లం 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌’ (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్’ కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించింది. “శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న … Read more

Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..

Surya Mitra

Surya Mitra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువకులను “సూర్య మిత్రలు (Surya Mitra )గా తీసుకోవాల‌ని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి సోలార్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రారంభించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సోలార్ … Read more

Bulldozer Action | మైనర్ బాలికపై రేప్‌ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video

Bulldozer Action

Bulldozer Action | మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న‌ సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్‌ ఖాన్‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం బుల్డోజ‌ర్ చ‌ర్య చేప‌ట్టింది. ఆయోధ్యలో నిందితుడి బేకరీని జేసీబీలతో నేల‌మ‌ట్టం చేయించింది. అయితే విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరి నిర్వ‌హిస్తున్న‌ట్లు తేలింది. దీంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించ‌గా అధికారులు వెంట‌నే అమ‌లు చేశారు. ఈ ఘటనపై యూపీ మంత్రి, నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌ … Read more

Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?

Kanwar Yatra Rules

Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే  ‘కన్వర్ యాత్ర’కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ  క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..  శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కన్వర్ యాత్ర’ మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపుల‌కు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించ‌నుంది. … Read more

Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Trains Cancelled in Secundrabad

Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం … Read more

Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Hathras stampede

Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక‌ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేర‌కు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్ల‌డించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ … Read more